Tue Dec 16 2025 03:30:44 GMT+0000 (Coordinated Universal Time)
కానిస్టేబుల్ ను చంపేసిన ఎర్రచందనం స్మగ్లర్లు
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్ ను వాహనాన్ని కొట్టి మరీ చంపేశారు.

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్ ను వాహనాన్ని కొట్టి మరీ చంపేశారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావడంతో సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద ఉన్నారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన...
తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు గాలింపు చేపట్టి ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఎర్ర చందనం స్మగ్లర్లు అటవీ శాఖ సిబ్బందిపై దాడులకు దిగారు. గణేశ్ మరణించడంతో తమకు దాడుల సమయంలో రక్షణ కల్పించాలని అటవీ శాఖ సిబ్బంది కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

