Tue Jan 20 2026 11:40:08 GMT+0000 (Coordinated Universal Time)
ACB Raids : ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి కూడా ఏసీబీ అధికారులు దొరికిపోయారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలను బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ లో...
అయితే లంచం మొత్తాన్ని తన సీనియర్ అసిస్టెట్ మదన్ మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నాగోల్ లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఇంట్లో పదహారు లక్షల రూపాయల నగదుతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Next Story

