Thu Sep 12 2024 11:26:03 GMT+0000 (Coordinated Universal Time)
తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడికి దిగారు.
తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడికి దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న కిరణ్ అనే విద్యార్థిపై సీనియర్లు ర్యాంగింగ్ కు పాల్పడ్డారు.
దాడికి పాల్పడి...
కిరణ్ పై రాత్రి నుంచి ఉదయం వరకూ దాడికి పాల్పడ్డారు. దీంతో కిరణ్ తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిట్ కళాశాల యాజమాన్యం సీరియస్ అయింది. ర్యాంగింగ్ కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Next Story