Fri Oct 04 2024 05:14:18 GMT+0000 (Coordinated Universal Time)
ఆన్ లైన్ గుర్రపు పందేల ముఠా అరెస్ట్
ఆన్ లైన్ గుర్రపు పందేలను నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు
ఆన్ లైన్ గుర్రపు పందేలను నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఫంటర్స్ ను ఆకర్షించి ఈ పందేలను నిర్వహిస్తున్నారు. ఈ రేసులు నిర్వహిస్తున్న జోజిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐదు నగరాల్లో....
365 ఆన్ లైన్ రేసుల అప్లికేషన్ లలో గుర్రపు పందేలను నిర్వహిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, మైసూరులో ఈ పందేలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. మొత్తం ఐదుగురు సభ్యుల గల ఈ ముఠా నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఈ ఆన్ లైన్ పందేలు ద్వారా చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story