Mon Sep 09 2024 12:14:56 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
రాజస్థాన్ రాయల్, బెంగుళూరు మధ్య జరిగే మ్యాచ్ కు పాండిచేరిలోని యానాం నుంచి బెట్టింగ్ నడిపిస్తున్నట్లు గుర్తించినట్లు..
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంది రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఐపీఎల్ సీజన్ మొదలవ్వగానే.. ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడుతున్న నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, కారు, రెండు టూ వీలర్స్, రూ.45 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ రాయల్, బెంగుళూరు మధ్య జరిగే మ్యాచ్ కు పాండిచేరిలోని యానాం నుంచి బెట్టింగ్ నడిపిస్తున్నట్లు గుర్తించినట్లు మహేష్ భగవత్ తెలిపారు. సబ్ బుకిస్, బుకిస్, ఫంటర్లను అరెస్ట్ చేశామన్న ఆయన.. ప్రధాన నిందితుడైన సాయిరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో నాగరాజు అనే నిందితుడు 2016లో ఒకసారి క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించేవారిపై సెక్షన్ 3, సెక్షన్ 4 కింద తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఎక్కడైనా బెట్టింగులు జరుగుతుంటే 9490617111 కాల్ చేసి సమాచారమివ్వాలని కోరారు.
Next Story