Fri Dec 05 2025 13:29:40 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టపర్తి మున్సిపల్ కమిషర్ ఆత్మహత్య
పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం కడప రైల్వే గేటు వద్ద కన్పించింది

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం కడప రైల్వే గేటు వద్ద కన్పించింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో మునికుమార్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించారు. అదే సమయంలో ఆయనను పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా డిప్యుటేషన్ పై పంపారు. మూడు నెలల క్రితమే ఆయన పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టారు.
రెండు రోజుల క్రితమే....
అయితే మునికుమార్ రెండు రోజుల క్రితం పుట్టపర్తి నుంచి కడపకు వచ్చారు. మునికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి సమస్యలు లేవని చెబుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మునికుమార్ మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Next Story

