Fri Dec 05 2025 21:53:16 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ నేత, సింగర్ సిద్దూ దారుణ హత్య
స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సిద్ధూని, మిగతా ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి..

పంజాబ్ : కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాన్సాలోని సివిల్ ఆస్పత్రిలో సిద్దూ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. సిద్దూ జీపులో జవహర్ కే గ్రామంవైపుకు వెళ్తుండగా.. కొందరు దుండగులు ఆయనపై 20 రౌండ్ల వరకూ కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో సిద్ధూతో పాటు మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సిద్ధూని, మిగతా ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన సిద్ధూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా.. శనివారమే పంజాబ్ లో వీఐపీలకు భద్రతను ఉపసంహరించగా.. ఆదివారం సిద్దూ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధూ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు, అతని అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
Next Story

