Thu Sep 19 2024 00:24:21 GMT+0000 (Coordinated Universal Time)
తీసుకున్న అప్పు చెల్లించలేదని.. భర్త కళ్లెదుటే దారుణం
చెప్పిన సమయానికి అప్పు చెల్లించలేకపోవడంతో.. నిందితుడు మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి..
తీసుకున్న అప్పును సకాలంలో తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత దంపతులు నిందితుడైన షేక్ ఇంతియాజ్ నుంచి కుటుంబ అవసరాల నిమిత్తం కొంతకాలం క్రితం రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయారు.
చెప్పిన సమయానికి అప్పు చెల్లించలేకపోవడంతో.. నిందితుడు మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు. దానిని వీడియో తీసి.. మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని బాధితురాలు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఇంతియాజ్ ఆగడాలను భరించలేక బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Next Story