Wed Apr 01 2026 16:19:23 GMT+0530 (India Standard Time)
కూల్ డ్రింక్ లో మద్యం కలిపి.. యువతికి ఇచ్చి
ఈ ఘటనపై ఏపీలో జీరో ఎఫ్.ఐ.ఆర్. కేసు నమోదు చేసుకుని హైదరాబాదు నగరంలోని

సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లను నమ్మేస్తూ ఉంటాం. అవతలి వ్యక్తులు ఎవరో, ఎలాంటి వాళ్లో తెలియకుండా పరిచయాలు పెంచేసుకుంటూ ఉంటాం. అన్ని విషయాలను చెప్పేస్తూ ఉంటాం. తీరా కొన్ని కొన్ని సార్లు అడ్డంగా బలైపోతూ ఉంటాం. అలాంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిపై లైంగిక దాడి జరిగిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మధురా నగర్ పీఎస్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు దుర్మార్గుడు. ఆ తర్వాత ఆమె నగ్నంగా ఉన్నప్పుడు ఫోటోలను తీశాడు. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ల టార్చర్ భరించలేకపోయిన యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ ఘటనపై ఏపీలో జీరో ఎఫ్.ఐ.ఆర్. కేసు నమోదు చేసుకుని హైదరాబాదు నగరంలోని బోర బండ పరిధిలో ఉన్న మధురానగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతికి తన బంధువైన మరో యువతి ద్వారా గండేపల్లి మండలం పి నాయకం పల్లి గ్రామానికి చెందిన వాలంటరీ జాషువా, కపిలేశ్వర మండలం అంగారా గ్రామానికి చెందిన నరసింహమూర్తి పబ్జి గేమ్ తో పరిచయమయ్యారు. యువతి ఈ ఇద్దరు వ్యక్తులతో కలిసి పబ్జి గేమ్ ఆడుతుండేది. ఈ నేపథ్యంలోనే యువతికి జాషువాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2020లో వివాహం చేసుకున్నారు. అయితే అది నచ్చని నర్సింహమూర్తి పెళ్లి అయిన సరే ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో జంట మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం కోసం ఆ యువతి ఏపీ నుండి బల్కంపేటకు వచ్చింది. అయినా కూడా నరసింహమూర్తి వేధింపులు ఆపలేదు. పథకం ప్రకారం నర్సింహా మూర్తి జవహర్ నగర్ లోని మల్లన్న గుట్టలో ఉన్న తన రూము కు రావాలని ఆ యువతిని కోరాడు. అతని మాటలు నమ్మిన యువతి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అతను యువతికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ యువతి స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడి నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. వాటిని యువతి ఫోన్ కు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత యువతి తన స్వగ్రామానికి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాదులోని మధురానగర్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story

