Thu May 16 2024 15:31:06 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది ఘాతకం.. యువతిని కాల్చి.. ఆపై ఆత్మహత్య
ప్రేమించిన యువతి.. తన ప్రేమను నిరాకరించడం, పెళ్లికి నో చెప్పడంతో ఆమెను గన్ తో కాల్చి చంపాడు.
తాడిపత్రి : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపత్రిలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. సురేష్ అనే యువకుడు ప్రేమించిన యువతి.. తన ప్రేమను నిరాకరించడం, పెళ్లికి నో చెప్పడంతో ఆమెను గన్ తో కాల్చి చంపాడు. ఆపై తాను కూడా అదే తుపాకి తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. సురేష్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా సురేష్ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. తుపాకి చప్పుళ్లకు.. అప్రమత్తమైన గ్రామస్తులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story