Sun Dec 08 2024 15:28:08 GMT+0000 (Coordinated Universal Time)
ప.గో జిల్లా శివాలయ ఆవరణలో అర్చకుడి హత్య..
నిడదవోలు మండలం తాడిమల్లలో ఈ ఘటన జరిగింది. అర్చకుడి హత్య స్థానికంగా అలజడి రేపుతోంది.
నిడదవోలు : పశ్చిమగోదావరి జిల్లాలో అర్చకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. శివాలయ ఆవరణలోనే దుండగులు అర్చకుడిని రాళ్లతో కొట్టి హత్య చేశారు. నిడదవోలు మండలం తాడిమల్లలో ఈ ఘటన జరిగింది. అర్చకుడి హత్య స్థానికంగా అలజడి రేపుతోంది. మృతుడు వెంకటనాగేశ్వరరావు అని, కొంతకాలంగా ఆయన శివాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను గుర్తు పట్టేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story