Fri Oct 11 2024 08:22:29 GMT+0000 (Coordinated Universal Time)
పూజారి హత్యకేసును చేధించిన పోలీసులు
నిడదవోలు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామశివారులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొత్తలంక వెంకటనాగేశ్వరశర్మ అనే పూజారి మార్చి21న హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. నిడదవోలు పోలీసుల దర్యాప్తులో పూజారిని హత్య చేసింది.. అతని తమ్ముడి కుమారుడేనని తేలింది.
ఆస్తి తగాదాల నేపథ్యంలో కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్.. మరో నలుగురితో కలిసి పూజారిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు సుమంత్ సహా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన హనుమంతరావు, ఆలపాటి రాఘవ, తూర్పుగోదావరి జిల్లా ఎల్చేరుకు చెందిన సురేశ్, విజ్యేశ్వరానికి చెందిన షేక్ పీర్ మజీన్ లను అరెస్ట్ చేశారు. నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Next Story