Thu Sep 12 2024 13:19:22 GMT+0000 (Coordinated Universal Time)
హన్మకొండలో విషాదం.. యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
భర్త ప్రవీణ్ హత్యచేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
హన్మకొండ : హన్మకొండ బ్యాంక్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణీగా ఉన్న యునియన్ బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. భర్త ప్రవీణ్ హత్యచేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనూష అనే యువతికి ప్రవీణ్ అనే యువకుడితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యేనాటికి అనూష ఆంధ్రాబ్యాంక్ లో క్లర్క్ గా పనిచేసేది. భర్త ప్రవీణ్ యూనియన్ బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.
పెళ్లి సమయంలో ప్రవీణ్ కు రూ.25 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ముట్టజెప్పారు అనూష తల్లిదండ్రులు. అయినప్పటికీ.. అదనపు కట్నం కోసం అనూషను వేధించేవాడని, ఆమెపై అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనూష మృతిపై తమకు అనుమానాలున్నాయని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వాపోయారు.
Next Story