Fri Sep 13 2024 01:58:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితుల విచారణ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను నేడు పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేశారు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను నేడు పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ వినియోగించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వీరందరికీ నోటీసులు ఇచ్చి నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులయిన ఆరుగురు నిందితులలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంతో...
వారిని కూడా నేడు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు బెంగళూరు పోలీసులు నేడు న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు. ఈ ఆరుగురు నిందితుల్లో ఐదుగురు బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేశారు. విజయవాడకు చెందిన వాసు బ్యాంక్ ఖాతాలో పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు.
Next Story