Tue Jan 20 2026 14:15:15 GMT+0000 (Coordinated Universal Time)
డ్రంకెన్ డ్రైవ్ లో దొరికి... తన వాహనాన్ని తానే తగలబెట్టుకుని
పోలీసులకు మద్యం తాగి దొరికాడు. దీంతో కోపమొచ్చి తన వాహనాన్ని తానే తగులపెట్టుకున్నాడు

పోలీసులకు మద్యం తాగి దొరికాడు. దీంతో కోపమొచ్చి తన వాహనాన్ని తానే తగులపెట్టుకున్నాడు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ ఘటన జరిగింది. నాంపల్లి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, రైల్వే స్టేషన్ కు సమీపంలో చేతక్ పై సజ్జాత్ ఆలీఖాన్ వచ్చాడు. పోలీసులు అతనిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. దీంతో సజ్జత్ ఆలీఖాన్ మద్యం మోతాదుకు మించి తాగినట్లు తేలిపోయింది. దీంతో పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు.
వాహనం కావాలంటూ....
వెహికల్ తనకు కావాలంటూ సజ్జాత్ ఆలీఖాన్ పోలీసులను చాలాసేపు వరకూ వేడుకున్నారు. కానీ సీజ్ చేసిన వాహనాన్ని కోర్డు ద్వారానే తీసుకోవాలని చెప్పడంతో ఆగ్రహించిన ఆ యువకుడు తన వాహనాన్ని తానే తగలబెట్టారు. వెంటనే స్థానికులు, పోలీసులు కలసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సజ్జాత్ ఆలీఖాన్ పై నాంపల్లి పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.
Next Story

