Sun Mar 08 2026 01:49:25 GMT+0530 (India Standard Time)
నేడు విజయవాడకు కుక్కల విద్యాసాగర్
ముంబయి నటిని వేధించిన కేసులో నిందితుడు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను నేడు పోలీసులు విజయవాడకు తీసుకు రానున్నారు

ముంబయి నటిని వేధించిన కేసులో నిందితుడు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను నేడు పోలీసులు విజయవాడకు తీసుకు రానున్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1 నిందితుడిగా ఉననారు. కుక్కల విద్యాసాగర్ ను నిన్న విజయవాడ పోలీసులు డెహ్రాడూన్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అక్కడి నుంచి నేడు విజయవాడకు తీసుకురానున్నారు.
ముంబయి నటి కేసులో...
ముంబయి నటిని వేధించి, ఆమెపై అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలపై కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ను విచారించిన తర్వాత పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారని తెలిసింది.
Next Story

