Wed Mar 18 2026 06:43:25 GMT+0530 (India Standard Time)
కరీంనగర్ లో కరెన్సీ కట్టలు...హోటల్ సెల్లార్లో ఆరు కోట్లు... ఎవరివంటే?
కరీంనగర్ ప్రముఖ హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించారు.

కరీంనగర్ ప్రముఖ హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించారు. హోటల్ పార్కింగ్ లో ఆరు కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఇప్పుడే ఇంత పెద్దమొత్తంలో నగదు బయటపడటం అధికారులను సయితం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ నగదు ఎవరిది అన్న దానిపై ఇంకా సమాచారం అందలేదు.
షెడ్యూల్ విడుదల కాకముందే...
అయితే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిసి ముందుగానే నగదును తీసుకెళుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించగా ఆరు కోట్ల రూపాయలు లభించాయి. దొరికిన డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు.
Next Story

