Fri Dec 05 2025 16:21:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ నుంచి తరలిస్తున్న గంజాయి స్వాధీనం
భువనగిరిలో మూడు టన్నుల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని స్మగ్లర్లకు ఇతర రాష్ట్రాలకు తరలించడం ఆపడం లేదు. ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా ముఠాలు గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు. జాతీయ రహదారి పై కాకుండా షార్ట్ కట్ రూట్లలో గంజాయిని సరఫరా చేస్తుంటారు. ఇటు తెలంగాణ, మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారు.
మహారాష్ట్రకు....
అయినా ఫలితం లేదు. తాజాగా భువనగిరిలో మూడు టన్నుల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ యాభై లక్షల పై చిలుకు ఉంటుందని చెబుతున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- ganja
- bhuvanagiri
Next Story

