Fri Dec 05 2025 12:42:48 GMT+0000 (Coordinated Universal Time)
ఔటర్ రింగురోడ్డుపై కాల్పులు.. ఉత్తుత్తిదే..నాటకం
అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కాల్పుల ఘటన నాటకమని పోలీసుల విచారణలో తేలింది

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కాల్పులు జరిగాయని పోలీసులు పరుగులు తీశారు. కారులో వచ్చిన దుండగులు లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారని లారీ డ్రైవర్ మనోజ్ ఫిర్యాదుతో పోలీసులు పరుగులు తీశారు. అయితే అది నాటకంగా పోలీసుల విచారణలో బయటపడింది. లారీ ముందు అద్దం పగిలిపోవడంతో డ్రైవర్ మనోజ్ ఈ నాటకానికి తెరతీశాడని పోలీసులు చెబుతున్నారు.
యజమాని తిడతాడని...
మెదక్ నుంచి కేరళలోని కొచ్చి నగరానికి ఐరన్ లోడ్ తో వెళుతున్న లారీ ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చేసరికి లారీ అద్దం పగిలిపోయింది. దీంతో యజమాని తిడతాడని భావించిన డ్రైవర్ మనోజ్ కాల్పుల నాటకం ఆడారు. తనపై ఎవరో దుండగులు కాల్పులు జరిపాడంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హైరానా పడ్డారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో అది నాటకమని తేలడంతో మనోజ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story

