Fri Dec 05 2025 11:31:33 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka : మాజీ డీజీపీని హత్య చేయడమే కాకుండా.. ఫినిష్ చేశానంటూ మరో మాజీ పోలీసు అధికారికి మెసేజ్
. ఆస్తి కోసం భార్య పల్లవి కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది

మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తుల కోసం కట్టుకున్న వాడిని, కన్నతండ్రిని చంపే రోజులు వచ్చేశాయి. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆస్తి కోసం భార్య ఓం ప్రకాశ్ ను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక మాజీ ఐపీఎస్ అధికారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అదీ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఊహించి ఉండరు. ఎన్నో కేసులను డీల్ చేసిన ఆయన చివరకు తన భార్య చేతిలోనే తుది శ్వాస విడవాల్సి వచ్చింది. ఇంతకంటే దురదృష్టకరమైన ఘటన ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఎవరి వద్ద సమాధానం లేదు.
పల్లవి ఇచ్చిన సమాచారంతో...
కర్ణాటకలో డీజీపీగా 2015లో మార్చి 1న బాధ్యతలను చేపట్టిన ఓం ప్రకాశ్ బీహార్ కు చెందిన వారు. ఆయన 1981 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన పదవీ విరమణ చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన వయసు 68 ఏళ్లు. 2017లో పదవీ విరమణ చేసిన ఓం ప్రకాశ్ బెంగళూరులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు వాతావరణానికి అలవాటు పడిన ఆయన అక్కడే హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో తన భార్యతో కలసి ఉంటున్నారు. అయితేనిన్న మధ్యాహ్నం ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తన భర్త పడిపోయాడంటూ ఆయన భర్త పల్లవి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఓం ప్రకాశ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆస్తుల విషయంలో...
గత కొంత కాలంగా ఓం ప్రకాశ్ ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. భార్య పల్లవితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో ఆయన తరచూ గొడవ పడేవారని తెలిసింది. తన భర్త ఓం ప్రకాశ్ తనను కుటుంబ సభ్యులను హింసిస్తున్నట్లు ఇటీవల ఆయన భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపులో కూడా పోస్టు చేసింది. ఇంటి ముందు నిరసనకు కూడా దిగింది. తనను తుపాకీతో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఓం ప్రకాశ్ తన ప్రాణానికి ముప్పు తన భార్య నుంచి పొంచి ఉందని ఊహించలేకపోయారు. ఓం ప్రకాశ్ భార్య పల్లవి ఆయనను కత్తితో పలుసార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత ఆమె మరో మాజీ డీజీపీకి ఐ హ్యావ్ ఫినిస్డ్ మాన్ స్టర్ అంటూ పోస్టు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఓం ప్రకాశ్ కుమార్తె , కోడళ్లతో పాటు భార్య పల్లవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story

