Mon Oct 07 2024 15:30:29 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాడ్ డాక్టర్
ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ డాక్టర్ కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది
ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ డాక్టర్ కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న కేసులో ఇప్పటికే నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 22 మంది అరెస్ట్ చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఆదిత్య రెడ్డి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సైకియాట్రిస్ట్ గా....
ఆదిగ్య రెడ్డి సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. మానసిక రోగులపై ఈ డ్రగ్స్ ను ఆదిత్య రెడ్డి వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎన్సీబీ అధికారులు ఆదిత్యరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదిత్య రెడ్డి ఓన్లీ లవ్ పేరుతో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు కనుగొన్నారు. దీనిపై ఎన్సీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story