Sat Dec 06 2025 16:30:28 GMT+0000 (Coordinated Universal Time)
రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి
కూకట్ పల్లి లోని రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

కూకట్ పల్లి లోని రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని ఒక అపార్ట్ మెంట్ లో రేణు అగర్వాల్ ను హత్య చేసి వారికి చెందిన స్కూటీపై పారిపోయిన నిందితులు జార్ఖండ్ కు పారిపోయారు. వారి సొంత స్థలం జార్ఖండ్ కు వెళ్లి ఉంటారని అనుమానించిన పోలీసు ప్రత్యేక బృందం అక్కడకు చేరుకున్నారు.
జార్ఖండ్ లో అదుపులోకి తీసుకుని...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి జార్ఖండ్ కు చేరుకున్న నిందితులను జార్ఖంఢ్ కు వెళ్లిన స్పెషల్ టీం అదుపులోకి తీసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్ఆధారంగా నిందితులు రోషన్, హర్షలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని జార్ఖండ్ నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. జార్ఖండ్ నుంచి పనికి వచ్చి ఇంటి యజమానురాలిని హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Next Story

