Sun Mar 26 2023 08:16:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదానికి కారణం అదే
విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను పోలీసులు గుర్తించారు.

విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను పోలీసులు గుర్తించారు. చిచ్చు బుడ్లు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. చిచ్చు బుడ్ల అన్ లోడ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.
అన్లోడ్ చేస్తుండగా...
ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా మూడు బాణసంచా దుకాణాలు దగ్దమయ్యాయి. 16వ నెంబరు స్టాల్ లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చిచ్చు బుడ్లు వత్తిడికి లోనయి పేలి పోయి ఉండవచ్చని ఆయన తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసు కమిషనర్ తెలిపారు.
Next Story