Mon Sep 09 2024 12:19:59 GMT+0000 (Coordinated Universal Time)
ఉప్పల్ వద్ద డ్రగ్స్.. పోలీసుల అదుపులో ముఠా
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ బస్ స్టేషన్ వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అధికారులు దాడులు చేస్తున్నా డ్రగ్స్ ను మాత్రం సరఫరా చేస్తూ మరికొందరు దొరికిపోతున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ బస్ స్టేషన్ వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో....
ఈ అంతరాష్ట్ర ముఠాను ఎల్.బి.నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఈ ముఠా డ్రగ్స్ ను సరఫరా చేస్తుంది. పక్కా సమాచారంతో ఉప్పల్ బస్టాండ్ వద్ద రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 1.5 కేజీల ఓపీఎం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story