Fri Aug 12 2022 05:30:34 GMT+0000 (Coordinated Universal Time)
అమ్నీషియా పబ్ కేసులో కీలక పరిణామం

Hyderabad : జూబ్లీహిల్స్ లోని అమ్నీషియా పబ్ కేసులో నిందితులకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు. బాలిక అత్యాచారం కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్ లకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
డీఎన్ఏ సేకరణకు....
ఇన్నోవా వాహనంలో లభ్యమయిన ఎవిడెన్స్ కు, ఈ డీఎన్ఏ పరీక్షలు అవసరమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు పరిశోధన మరింత శాస్త్రీయంగా జరుగుతుందన్నది పోలీసుల వాదన. వారి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపాలన్న యోచనలో ఉన్నార. అవరమై బాధితురాలి డీఎన్ఏ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించారు. నిందితులకు బెయిల్ లభించినా దేశం విడిచి పోకుండా వారి పాస్పోర్టులు సీజ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
Next Story