Wed Mar 18 2026 08:16:29 GMT+0530 (India Standard Time)
Pallavi Prashanth : వాహనాల ధ్వంసం కేసులో మరో ముగ్గురి అరెస్ట్
పల్లవి ప్రశాంత్ పై నమోదయిన కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పల్లవి ప్రశాంత్ పై నమోదయిన కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ గా ఎంపికయి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ అభిమానులు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ కూడా ఫిర్యాదు చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పథ్నాలుగు రోజులు రిమాండ్...
పల్లవి ప్రశాంత్ ను ఇప్పటికే అరెస్ట్ చేసినా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే తాజాగా సరూర్ నగర్ కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడకు చెందిన సుధాకర్, ఇందిరానగర్ కు చెందిన పవన్ అనే యువకులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పర్చారు. న్యాయమూర్తి వారికి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. వాహనాల ధ్వంసం చేసిన కేసులో ఈ ముగ్గురు కీలక నిందితులుగా పేర్కొన్నారు.
Next Story

