Sat Jul 27 2024 02:21:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎర్రచందనం దొంగల ఆటకట్టు
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు
![sandalwood, police, arrest sandalwood, police, arrest](https://www.telugupost.com/h-upload/2022/07/07/1385827-sandalwood-police-arrest.webp)
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1,281 కేజీల బరువుగల 43 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొంద పంచాయతీ గొల్లపల్లి సమీపంలో వాహనాల్లోకి ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
స్మగ్లర్ కోసం...
అయితే లోడు చేస్తున్న వారిలో ఐదుగురు పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి పరారయ్యారు. ప్రధాన స్మగ్లర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ తెలిిపారు. ప్రధాన స్మగ్లర్ ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story