Fri Apr 10 2026 22:02:16 GMT+0530 (India Standard Time)
చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తులు
చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తుల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు

చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తుల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. యాదమరి మండలం వరికిపల్లి జంక్షన్ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి. బెంగళూరు నుంచి తిరుపతికి అక్రమంగా పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్నారు.
బెంగళూరు నుంచి...
ఈ సందర్భంగా పోలీసులు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సుమారు తొమ్మిది లక్షల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కడికి తీసుకెళుతున్నారు? ఎవరికి అందచేయడానికి తీసుకెళుతున్నారన్న దానిపై విచారించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
Next Story

