Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru : కొలిక్కి వస్తున్న బెంగళూరు ఏడు కోట్ల నగదు దోపిడీ కేసు
బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు

బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సస్పెండయిన కానిస్టేబుల్ తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ప్రమేయం ఉందని గుర్తించారు. బెంగళూరులో పట్టపగలే ఏటీఎం వాహనం నుంచి 7.11 కోట్ల రూపాయలను దోపిడీ చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసంద. అయితే బెంగళూరులో దోపిడీకి పాల్పడి ఇన్నోవా వాహనంలో నిందితులు పారిపోయారు. తాము పారిపోయిన ఇన్నోవా వాహనాన్ని చిత్తూరు జిల్లాలో వదిలి వెళ్లారు. దోపిడీ చేసిన వాహనాన్ని మరొక వాహనంలోకి మార్చుకుని నిందితులు ఆ ఇన్నోవా వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీటీవీ పుటేజీ ఆధారంగా...
సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వాహనం ఎటు వైపు వెళ్లిందని గుర్తించి చిత్తూరు జిల్లాలో దానిని కనుగొన్నారు. నిందితులు చాలా తెలివిగావ్యవహరించారు. తాము రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులమని చెప్పి నగదుతో వెళుతున్న ఏటీఎం వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. తమ వాహనానికి కేంద్ర ప్రభుత్వం స్టిక్కర్ ఉండటంతో వారు పెద్దగా అనుమానింలేదు. దీంతో తనిఖీ చేస్తున్నట్లు నటించి ఆ వాహనంలో ఉన్న నగదును తమ ఇన్నోవా వాహనంలోకి మార్చుకుని పరారయ్యారు. దీనిపై బెంగళూరు పోలీసులు బృందాలుగా ఏర్పడి వెంటనే వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దోపిడీకి పాల్పడిన వారిలో...
అయితే ఈ దోపిడీకి పాల్పడింది కర్ణాటకలో సస్పెండ్ అయిన ఒక కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆ కానిస్టేబుల్ కు చిత్తూరు జిల్లాకు చెందిన అతని స్నేహితులు సహకరించారని అనుమానిస్తున్నారు. వారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా ప్రాధమికంగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. వారిలో కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే పూర్తి వివరాలు అందలేదు. వీరుస్నేహితులు కావడంతో సులువుగా డబ్బు సంపాదనపై దృష్టిపెట్టి ఏటీఎం వాహనాన్నిదోపిడీకి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెల్లడయింది. బెంగళూరు నగదు దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించినట్లు తెలిసింది.
Next Story

