Fri Sep 13 2024 03:01:49 GMT+0000 (Coordinated Universal Time)
చెడ్డీ గ్యాంగ్ కోసం 8 ప్రత్యేక బృందాలు
ఆంధ్రప్రదేశ్ లో చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చెడ్డీ గ్యాంగ్ ఇటీవల రెయిన్ బో విల్లాలలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా గుజరాత్ లోని దాహోద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అక్కడి పోలీసులను ఏపీ పోలీసులు సంప్రదించారు. వారి ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గుజరాత్ నుంచి చెడ్డీగ్యాంగ్ లో కొందరు సభ్యులు ఏపీలోకి ప్రవేశించారు.
గుజరాత్ నుంచి...
వీరిని అరెస్ట్ చేసేందుకు కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందుకోసం ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫొటోలు, సీసీ టీవీ ఫుటేజీ సాయంతో వీరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story