Sun Oct 13 2024 21:16:15 GMT+0000 (Coordinated Universal Time)
Harsha Sai : హర్ష సాయి ఎక్కడ? పోలీసులకు దొరకకుండా?
యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. యువతి అత్యాచారం కేసులో హర్షసాయిపై కేసు నమోదయింది
యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. యువతి అత్యాచారం కేసులో హర్షసాయిపై కేసు నమోదయింది. దాదాపు ఐదు రోజుల నుంచి హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. హర్షసాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయన ఆచూకీ ఎక్కడ ఉందో తెలియడం లేదు.
కొన్ని రోజుల నుంచి...
హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హర్షసాయి తండ్రిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నా హర్షసాయి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు అనుమానం ఉన్న చోటల్లా గాలిస్తున్నారు.
Next Story