Fri Dec 05 2025 23:16:39 GMT+0000 (Coordinated Universal Time)
సజీవదహనం కేసులో ట్విస్ట్
మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం అయిన ఘటనలో పోలీసులు కొత్త కోణంలో విచారిస్తున్నారు

మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం అయిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని కొందరు కావాలనే ఇంటికి నిప్పుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఇంటికి నిప్పు పెట్టడానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి వద్ద లభ్యమైన పెట్రోలు క్యాన్ లు ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తగులపెట్టారన్న....
ఏ పెట్రోలు బంకు నుంచి దుండగులు పెట్రోలును తీసుకువచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక,ఆమె ఇద్దరు కుమార్తెలు సజీవ దహనమయిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
Next Story

