Thu Mar 19 2026 05:25:51 GMT+0530 (India Standard Time)
Amercia : అమెరికాలో తెలుగు వైద్యుడి అనుమానాాస్పద మృతి
అమెరికాలో తెలుగు రాష్ట్రానికి చెందిన వైద్యుడు పేరంశెట్టి రమేష్ బాబు అనుమానాాస్పద స్థితిలో మృతి చెందారు

అమెరికాలో తెలుగు రాష్ట్రానికి చెందిన వైద్యుడు పేరంశెట్టి రమేష్ బాబు అనుమానాస్పద స్థితిలో మరణించారు. నిన్న సాయంత్రం రమేష్ బాబుపై దరు కాల్పులు జరిగిలనట్లు గుర్తించారు. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన రమేష్ బాబు మరణించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాల్సి ఉంది. చిత్తూరు జిల్లా నాయుడుపేటకు చెందిన రమేష్ బాబు అమెరికాకు వెళ్లి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. టస్మలుసా ప్రాంతంలో ఆయన డాక్టర్ గా సేవలందిస్తున్నారు. దీంతో పాటు అమెరికాలో అనేక చోట్ల ఆయన ఆసుపత్రులు నిర్మించారు.
కాల్పులు జరపడంతో...
భారత్ నుంచి వెళ్లిన అనేక మంది రాజకీయ నేతలకు ఈయన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిగా ఆయనకు పేరుంది. టస్మలూసా ప్రాంతంలో ఆయన సేవలను గుర్తించి ఒక వీధికి ఆయన పేరును కూడా పెట్టారు. రమేష్ కు భార్య, నలుగురు పిల్లలున్నారు. అమెరికాలోనే స్థిరపడిన రమేష్ బాబుపై ఎవరు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పేరంశెట్టి రమేష్ బాబు మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

