Mon Jun 05 2023 13:31:08 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పర్యటనలో అపశృతి : ఒకరి మృతి
పవన్ కల్యాణ్ పర్యటనలో అపవృతి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు

పవన్ కల్యాణ్ పర్యటనలో అపవృతి చోటు చేసుకుంది. నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురిలో నరసింహస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించిన సంగతి తెలిసిందే. వారాహి వాహానానికి పూజలు చేయడం కోసం ఆయన కొండగట్టు వచ్చారు. అనంతరం ధర్మపురికి వెళ్లి తిరిగి వస్తుండగా పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను ఆయన అభిమానులు ఫాలో అయ్యారు. అయితే వెల్లటూర్ మండలం కిషన్ రావు పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
ముగ్గురికి గాయాలు,,,
ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ధర్మపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story