Fri Dec 05 2025 18:26:45 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణం తీసిన పార్కింగ్.. రియల్ వ్యాపారి మృతి
ప్రాణం తీసిన పార్కింగ్.. రియల్ వ్యాపారి మృతి

అపార్ట్ మెంట్ లో పార్కింగ్ గొడవ ఒకరి ప్రాణం తీసింది. హైదరాబాద్ చైతన్యపురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్ మెంట్ లో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా చోటు చేసుకున్న ఈ వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి రుతిక అపార్ట్ మెంట్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన నాగిరెడ్డి నివాసం ఉంటున్నారు. పదమూడేళ్లుగా ఉంటున్న ఆయన అక్కడే నివాసముంటున్నారు.
కారు పై గీతలు పడ్డాయని...
అదే అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబరు 402 లో అద్దెకు ఉంటున్న కామాక్షి అనే మహిళ ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ రాజమండ్రి నుంచి వచ్చాడు. కారును అపార్ట్ మెంట్ బయట పార్క్ చేశాడు. అయితే గండ్ర నాగిరెడ్డి ఆ కారు వెనక తన కారును పార్క్ చేశఆడు. అయితే తన కారుపై గీతలు కనిపించడంతో ఆగ్రహించిన కృష్ణ నాగిరెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో నాగిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నాగిరెడ్డి మరణించడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నారు.
Next Story

