Fri Sep 13 2024 13:57:37 GMT+0000 (Coordinated Universal Time)
బాలిక కిడ్నాప్.. ఆపై లైంగిక దాడికి యత్నం.. ఆఖరికి ఇలా..?
నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి యత్నించిన నిందితుడిని శుక్రవారం పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు
నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి యత్నించిన నిందితుడిని శుక్రవారం రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తాటిపత్రి రమేష్ (20) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఒంటరిగా ఆడుకుంటున్న....
డిసెంబర్ 2వ తేదీన పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఒంటరిగా ఆడుకుంటున్న పాపపై రమేష్ కన్ను పడింది. అంతే ఎవరికంటా పడకుండా పాపను కిడ్నాప్ చేశాడు. ఇంతలో కూతురి కోసం వెతికిన తల్లికి పాప కనిపించలేదు. కంగారుగా భర్తకు ఫోన్ చేసి తమ కూతురు ఇంటివద్ద లేదని, చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదని తెలిపింది. విషయం తెలుసుకున్న పాప తండ్రి హుటాహుటిన ఇంటికి వెళ్లి చుట్టుపక్కలంతా వెతికాడు. అయినా కనిపించకపోవడంతో తన స్నేహితుడైన విజయ్ తో కలిసి బైక్ పై పాపను వెతుకుతూ వెళ్లారు.
నిర్మానుష్య ప్రదేశంలో....
వీధి వీధిలో పాప కోసం గాలిస్తుండగా.. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో నిందితుడు రమేష్ పాపతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని పాప తండ్రి, అతని స్నేహితుడు గమనించారు. వెంటనే పాపను రమేష్ వద్ద నుంచి రక్షించగా.. నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం పాప తండ్రి రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, రమేష్ ను అరెస్ట్ చేసి, అతనివద్ద నుండి ఒక స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story