Fri Mar 20 2026 09:51:27 GMT+0530 (India Standard Time)
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి

హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి - నార్కేట్ పల్లి రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
అతి వేగమే....
అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్ అతి వేగమేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిద్రమత్తులో ఉండటం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

