Fri Dec 05 2025 12:45:08 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో మరోసారి ఉద్రిక్తత
కుప్పంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేశ్ పై కొందరు దాడి చేశారు

కుప్పంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేశ్ పై కొందరు దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వైసీపీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మురుగేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. ఒక హోటల్ లో ఉన్న మురుగేశ్ పై వైసీపీ లోని మరొక వర్గం ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.
వైసీపీలో మరో గ్రూపు...
మురుగేశ్ పై మారణాయుధాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. కుప్పం బైపాస్ రోడ్డులోని మంజునాథ్ రెసిడెన్సీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ భరత్ దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది.
Next Story

