Mon Sep 09 2024 11:59:49 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అమెరికాలో కాల్పులు.. ఏపీ విద్యార్ధి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డలాస్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి మరణించాడు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డలాస్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి మరణించాడు. పల్నాడు జిల్లా యాజిలికి చెందిన గోపీకృష్ణ అమెరికాలో ఎంఎస్ చదువు పూర్తి చేశాడు. అనంతరం ఒక స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తన్నాడు. అయితే స్టోర్ లోకి వచ్చిన పదహారేళ్ల యువకుడు గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు.
స్టోర్ లో పనిచేస్తుండగా...
ఒక సిగిరెట్ ప్యాకెట్ ను స్టోర్ నుంచి తీసుకుని గోపీకృష్ణపై కాల్పులు జరపగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందారు. దీంతో గోపీకృష్ణ కుటుంబంలో విషాదం అలుముకుంది. అకారణంగా కాల్పలు జరిపిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Next Story