Mon Sep 09 2024 10:42:34 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్ లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్ లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఆ తర్వాత నిందితుడు ఎరిక్ ఆడమ్స్ తనను తాను కాల్చుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. వేర్వేరు అపార్ట్మెంట్లలోకి చొరబడిన నిందితుడు ఎరిక్ ఆడమ్స్ కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
తనను తాను కాల్చుకుని...
నిందితుడు బాలికను కూడా గాయపర్చినట్లు పోలీసులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ఆను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం నలుగురు మహిళలు, ఒక యువకుడు మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎరిక్ ఆడమ్స్ ఎందుకు కాల్పులు జరిపారో తెలియలేదని పోలీసులు తెలిపారు.
Next Story