Sat Dec 06 2025 14:29:59 GMT+0000 (Coordinated Universal Time)
గన్ ఫైరింగ్ : ఐదుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు. లూయివిల్లోని బ్యాంకు భవనంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే కాల్పులకు తెగపడిన దుండగుడు కూడా మరణించాడు. ఈ కాల్పుల్లో ఆరుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
నిందితుడు కూడా...
లూయివిల్ లోని ఓల్డ్ నేషనల్ బ్యాంకు భవనంలో కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. కొందరు కాల్పులు ప్రారంభించగానే భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. నిందితుడు మరణించడంతో కాల్పులకు గల కారణాలు మాత్రం ఇక తెలిసే అవకాశం లేదు. ఆ ప్రాంతంలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు.
Next Story

