Sun Dec 08 2024 22:14:39 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో కాల్పులు : 13 మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాల్ మార్ట్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణఇంచారు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాల్ మార్ట్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణఇంచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు జరిగాయి. కాల్పులను స్టోర్ మేనేజర్ జరిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు.
వాల్మార్ట్ మేనేజర్ ....
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు ఈ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే కాల్పులు జరిపిన మేనేజర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని అక్కడకు చేరుకున్న పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story