Sun May 19 2024 02:48:32 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశం జిల్లా యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమింగ్
ప్రకాశం జిల్లా యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమింగ్
ప్రకాశం జిల్లాలో ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరానికి చెందిన లింగాల చెన్నకృష్ణ ఆన్ లైన్ గేమింగ్ సంస్థకు రూ.2లక్షలు బకాయి పడ్డాడు. బకాయిలు చెల్లించాలని ఆ సంస్థ వాళ్లు ఒత్తిడి చేశారు. కృష్ణ తల్లిదండ్రులు ఇప్పటివరకు రూ.లక్షా 60వేలు చెల్లించారు. మిగతా రూ.40వేలు కూడా చెల్లించాలని గేమ్ సంస్థ వాళ్లు యువకుడిని తీవ్రంగా వేధించారు. బకాయిలు చెల్లించలేక, టార్చర్ తట్టుకోలేకపోయిన కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
Next Story