Fri Dec 05 2025 12:23:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫస్ట్ నైట్ రోజు ఓపెన్ అయిన సితార.. 35 ముక్కలుగా నరికేస్తానంటూ వార్నింగ్
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన నిషాద్ తో సితార అనే యువతితో పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు

అబ్బాయిలూ జర జాగ్రత్త.. పెళ్లికి ముందే అమ్మాయి అంగీకారం తెలుసుకుంటే బెటర్ అని పిస్తుంది. ఎందుకంటే .. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను హత్య చేయించేంది కొందరయితే మరికొందరు మొదటి రాత్రి కత్తితో బెదిరింపులకు దిగుతూ ఉల్టా కేసు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతుంది. మొదటి రాత్రి కత్తిని తీసుకుని గదిలోకి వెళ్లి తనపై చేయి వేస్తే ముప్ఫయి ఐదు ముక్కలుగా నరికివేస్తనంటూ వధువు వరుడిని బెదిరించిన ఘటన వెలుగు చూసింది
పెళ్లిలో ఆనందంగానే...
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన నిషాద్ తో సితార అనే యువతితో పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో సితారలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. అసహనం కూడా సితార మొఖంపై కనిపించకపోవడంతో రెండు కుటుంబాల వారు ఆనందంగా పెళ్లి వేడుకలను జరిపించారు. అయితే సితారకు అంతకు ముందే అమన్ అనే యువకుడితో పరిచయం ఉంది. అతనితో ప్రేమలో ఉన్న సితార నిషాద్ ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో తన ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టింది.
వేధింపులకు దిగడంతో...
ఫస్ట్ నైట్ రోజు ఓపెన్ అయిపోయిన సితార తనపై చేయి వస్తే ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించింది. తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే తప్పుడు కేసులు కూడా పెడతానని బెదిరింపులకు దిగింది. పెళ్లి కొడుకు నిషాద్ తరుపున వారు పెద్దల పంచాయతీలో పెట్టడంతో సితార కు నచ్చచెప్పి ఆమె తల్లిదండ్రులు పంపించారు. నిషాద్ ఇంటికి వచ్చిన సితార తిరిగి బెదిరింపులకు దిగింది. దీంతో నిషాద్ కుటుంబంపోలీసులను ఆశ్రయించింది. సితార మాత్రం తన ప్రియుడు అమన్ తో జంప్ అయింది. దీంతో పోలీసులు సితార, అమన్ ల కోసం వెదుకుతున్నారు. అయితే ఈ కేసులో మాత్రం కొంత మంచి విషయం ఏంటంటే కట్టుకున్నోడ్ని కడ తేర్చకుండానే కేవలం వేధింపులతో సరిపెట్టింది.
Next Story

