Sun Mar 08 2026 03:13:02 GMT+0530 (India Standard Time)
Road Accident : ఢీకొట్టిన కారు.. 9 మంది స్పాట్ డెడ్
ఫుట్ పాత్ పై నడుస్తున్న వారిని కారు ఢీకొట్టడంతో 9 మంది మరణించారు. దక్షిణ కొరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది

ఫుట్ పాత్ పై నడుస్తున్న వారిని కారు ఢీకొట్టడంతో 9 మంది మరణించారు. దక్షిణ కొరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పైకి అదుపు తప్పి వేగంగా దూసుకు వచ్చిన కారు పాదచారులను ఢీకొట్టంది. దక్షిణ కొరియాలోని సెంట్రల్ సియోల్ లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉన్న వారిని కారు అదుపు తప్పి ఢీకొట్టింది.
అదుపుతప్పిన కారు...
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పా. పాదచారులను ఢీకొనే ముందు కారు రాంగ్ సైడ్ లోకి వెళ్లి మరో రెండు కార్లను ఢీకొట్టిందని మీడియా నివేదికలు వెల్లడించాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

