Mon Oct 07 2024 15:12:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏక్ నాథ్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ !
విడాకులు ఇవ్వాలంటే ఆస్తిని తమ కొడుకు పేరిట రాయాలని ప్రగ్యా డిమాండ్ చేసిందట. అలా రాయడం కుదరదని ఎంత చెప్పినా..
హైదరాబాద్ : పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అదనపు కట్నం, గృహ సింహ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 2014లో ఏక్ నాథ్ - ప్రగ్యా రెడ్డిలకు వివాహమైంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత ఏక్ నాథ్ కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. గతేడాది ఏక్ నాథ్ ప్రగ్యా నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో అప్పీల్ చేశాడు.
కాగా.. విడాకులు ఇవ్వాలంటే ఆస్తిని తమ కొడుకు పేరిట రాయాలని ప్రగ్యా డిమాండ్ చేసిందట. అలా రాయడం కుదరదని ఎంత చెప్పినా వినకుండా భర్తతో గొడవలు పడినట్లు తెలుస్తోంది. ఆస్తి కోసం ప్రగ్యా మొండిగా గొడవలు పడుతున్న కారణంగానే ఏక్ నాథ్ ఆమెను గదిలో బంధించి, బయటికి రాకుండా గోడ కట్టి పరారైనట్లు సమాచారం. కానీ.. ప్రగ్యా రెడ్డి తండ్రి మరోలా చెప్తున్నారు. ఏక్ నాథ్ - ప్రగ్యాలను అతని తండ్రి భారతి కలిసి ఉండనివ్వదని, ఆమె కారణంగానే వీరిద్దరూ గొడవలు పడుతున్నారని చెప్తున్నారు. ఏక్ నాథ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసుపై ఏక్ నాథ్ తల్లిదండ్రులు ఇప్పటివరకూ స్పందించలేదు.
Next Story