Fri Dec 05 2025 05:34:06 GMT+0000 (Coordinated Universal Time)
Nellore : నెల్లూరులో ఖతర్నాక్ లేడీ డాన్ లు...ఏందబ్బయా ఇది?
నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది. లేడీ డాన్ లు కూడా నెల్లూరులోనే ఉన్నారు

నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది. లేడీ డాన్ లు కూడా నెల్లూరులోనే ఉన్నారు. ఇప్పటికే అరుణను కటకటాల వెనక్కు నెట్టగా, తాజాగా మరో లేడీ డాన్ అరవ కామాక్షిని కూడా మరొక హత్య కేసులో అరెస్టయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్యలు జరుగుతున్నాయి. నిత్యం హత్యలతో నెల్లూరు ప్రాంతం అట్టుడికిపోతుంది. ఎక్కడ హత్య జరిగినా నెల్లూరు క్రిమినల్స్ చేయి ఉంది. ఈ ఖతర్నాక్ లేడీ హత్యలు చేయడంలో దిట్ట. స్కెచ్ వేయడంలో ఈమెకు మించిన వారు మరెవ్వరూ లేరు. గంజాయి కేసుల్లో అడ్డుపడుతున్నందుకు సీపీఎం నాయకుడు పెంచలయ్య ను హత్య చేయించింది అరవ కామాక్షిగా పోలీసులు గుర్తించారు.
పెంచలయ్య హత్య కేసులో...
నెల్లూరు నగరానికి చెందని సీపీఎం నాయకుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారించిన పోలీసులకు అరవ కామాక్షి ప్రమేయం బయటపడింది. కామాక్షితో పాటు మరొక ఏడుగురిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఐదు కిలోల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరవ కామాక్షి నెల్లూరు నగరంలో పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు నెరుపుతున్నారు. గత కొంత కాలంగా అన్ని ప్రధాన పార్టీలకు మద్దతుదారుగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తన వ్యాపారాన్ని యధేచ్ఛగా అరవ కామాక్షి కొనసాగిస్తున్నారు.
గంజాయి వ్యాపారం చేస్తూ...
గంజాయి వ్యాపారం చేస్తూ గంజాయి బ్యాచ్ ను మెయిన్ టెన్ చేస్తూ అరవ కామాక్షి బాగా కూడబెట్టింది. అరవ కామాక్షి ఒక గ్యాంగ్ ను మెయిన్ టెయిన్ చేస్తూ గంజాయి బ్యాచ్ తో వ్యాపారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. కామాక్షి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో యువకులను ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయాలకు పెంచలయ్య అడ్డుపడ్డాడని అతనిని హత్యచేయించిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఒక హత్య కేసులో కూడా ఈమె ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ ప్రారంభించారు. మొత్తం మీద నెల్లూరు నగరంలో లేడీ డాన్ లు, నేరగాళ్లు హెచ్చమీరడంపై ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

