Fri Feb 14 2025 10:57:46 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో మస్తాన్ సాయి
లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి తీసినట్లు ఫిర్యాదు చేయడంతో ఆయనను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి తీసినట్లు ఫిర్యాదు చేయడంతో ఆయనను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి తీసిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడు వందల మంది అమ్మాయిలను వీడియతో తీశారంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను మస్తాన్ సాయి లోబర్చుకుంటున్నట్లు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెడ్ రూముల్లో కెమేరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్ లను కూడా లావణ్య నార్సింగి పోలీసులకు ఇవ్వడంతో వారు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు.
బ్లాక్ మెయిల్ చేస్తూ...
తన వీడియోలు డిలీట్ చేయాలని అఢిగిన తనపై మస్తాన్ సాయి దాడి చేశాడని లావణ్యపై ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అమ్మాయిలకు డ్రగ్స్ కు బానిసలను చేసి మస్తాన్ లోబర్చుకుంటున్నాడని, తర్వాత వారిని ఈ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు.తన వద్ద ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ మస్తాన్ సాయి యువతులను బెదిరిస్తున్నాడని కూడా లావణ్య ఫిర్యాదులో తెలిపారు.కొందరు ఫోన్లను కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేశాడని, ఒకయువ హీరో ఫోన్ కూడా హ్యాక్ కు గురయిందని ఆయన తెలిపారు. మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న నార్సింగిపోలీసులు అతనిని విచారిస్తున్నారు.
Next Story