Wed Mar 18 2026 23:13:36 GMT+0530 (India Standard Time)
నవదీప్ నివాసంలో సోదాలు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహిస్తుంది

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహిస్తుంది. అయితే సోదాలు చేసే సమయంలో ఇంట్లో నవదీప్ లేరని సమాచారం. డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతోనే నార్కోటిక్ బ్యూరో నవదీప్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలియ వచ్చింది.
డ్రగ్స్ కేసులో...
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నిందితుడిగా ఉన్నారని పోలీస్ కమిషనర్ ఆనంద్ కూడా తెలిపారు. ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు. అయితే నవదీప్ తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై నార్కోటిక్ పోలీసులు ఈరోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన సన్నిహితుడు రామచంద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
Next Story

