Wed Dec 17 2025 06:41:31 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో నిహారిక.. ఏ తప్పూ చేయలేదంటున్న నాగబాబు
పబ్ యజమానులతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో పెద్ద పెద్ద వాళ్లకు చెందిన పిల్లలు ఉండటం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు గతరాత్రి దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో పెద్ద పెద్ద వాళ్లకు చెందిన పిల్లలు ఉండటం కలకలం రేపింది. వారిలో నాగబాబు కుమార్తె నిహారిక సహా.. రాహుల్ సిప్లిగంజ్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాడిసన్ బ్లూ హెటల్ ఘటనపై నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.
గతరాత్రి రాడిసన్ బ్లూ హోటల్ పబ్లో జరిగిన సంఘటనపై స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడుండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వలన పబ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారిక ఎలాంటి తప్పూ చేయలేదని పోలీసులే చెప్పారని నాగబాబు తెలిపారు. అనుమానాలతో అసత్య ప్రచారాలు చేయవద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు.
Next Story

